ఏపీలో గత ప్రభుత్వంసెకీతో చేసుకున్న ఒప్పందంపై ఆ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. అదానీపై చర్యలకు కచ్చితమైన సమాచారం కావాలని.. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామంటున్న చంద్రబాబు మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ అని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారని.. అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని ప్రశ్నించారు షర్మిల.
అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టీ కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారని.. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారని అన్నారు షర్మిల.ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు, అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడు ఎలా అయ్యాడంటూ ప్రశ్నించారు షర్మిల. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని, అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు.
ALSO READ | దావోస్లో ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
అదానీపై @gautam_adani చర్యలకు చంద్రబాబు @ncbn గారికి కచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు గారి మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని…
— YS Sharmila (@realyssharmila) January 23, 2025
అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని.. ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే.. మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లే అని అన్నారు షర్మిల.
అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని... అదానీ వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించాలని... నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబును కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందంటూ ట్వీట్ చేశారు షర్మిల.