కోటల్లో ఉండే జగన్.. ఇప్పుడు సిద్ధం అంటున్నారు.. జగన్ పై షర్మిల ఫైర్..

సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉండే జగన్, ఇప్పుడు బయటకు వచ్చి సిద్ధం అంటున్నాడని అన్నారు. జగన్ ఎప్పుడైనా ప్రజా సమస్యలు విన్నారా అని ప్రశ్నించారు. జగన్ కు, వైఎస్సార్ కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు షర్మిల.

వైఎస్ హయాంలో ప్రజాదర్బార్ ఉండేదని, ఆయన వారసుడు జగన్ హయాంలో ప్రజాదర్బార్ ఎందుకు లేదని ప్రశ్నించారు షర్మిల. వైఎస్ హయాంలో 90శాతం పూర్తైన హంద్రీనీవాను జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు.