2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా కడప ఎంపీగా బరిలో దిగిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదోని పర్యటించిన షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కుంభకర్ణుడిలా ఇంత కాలం నిద్రపోయి, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడింది సమయంలో నిద్ర లేచాడని మండి పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని, మతాల మధ్య విద్వేషాన్ని సృష్టించే బీజేపీ ఓటేయద్దని అన్నారు. వైసీపీ శ్రేణులు తమ సభలు అడ్డుకోవటానికి సిద్ధం జెండాలు పట్టుకొని వస్తున్నారని అన్నారు.దేనికి సిద్ధం అని అడుగుతున్నామని,రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు కుప్ప చేయడానికి సిద్ధమా,హోదా అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా, బీజేపీ కి గులాం గిరీ చేయడానికి సిద్ధమా, మద్య నిషేధమని చెప్పి కల్తీ మద్యం అమ్మడానికి సిద్ధమా అని మండిపడ్డారు షర్మిల.