విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు నమ్మి ఛాన్స్ ఇస్తే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాయని అన్నారు షర్మిల. జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని, రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారని షర్మిల అన్నారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని వాషింగ్టన్ డీసీ లా చేస్తానని చెప్పి, రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్, ఆయన ఆశయాలను పట్టించుకోవట్లేదని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చాలంటే రైతును రాజు చేయాలని, ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని అన్నారు షర్మిల.