కడప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రిని అవుతా... షర్మిల

జగన్ ను గద్దె దించుటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల జగన్ పై వరుస విమర్శలు చేస్తూ దూకుడు మీదున్నారు. కడప ఎంపీగా పోటీకి దిగిన షర్మిల ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రధానంగా విమర్శలు చేస్తూ జగన్, అవినాష్ రెడ్డిలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను ఒక్కటి కూడా అమలు చేయని జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని అన్నారు.

వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, ఆయన కొడుకు హయాంలో రైతులు అప్పులపాలు అయ్యారని అన్నారు. జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని అన్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డ అని, పులి బిడ్డను అని అన్నారు. కడప ఎంపీగా వైఎస్ఆర్ పని చేశారని, వివేకా కూడా కడప ఎంపీగా గెలిచారని, ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డ కూడా పోటీ చేస్తోందని అన్నారు. తనను గెలిపిస్తే కేంద్రంలో మంత్రి అవుతానని, ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నారు షర్మిల.