సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే బయటకు వస్తారని వైఎఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో షర్మిల ప్రజా ప్రస్తానం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల్లో గెలిచాక ప్రజల ముఖం చూడరని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించుకోవాలని కోరారు.
మంబోజీ పల్లి దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు వైఎస్ షర్మిలను కలిశారు. ఫ్యాక్టరీని మూసేయడంతో రోడ్డున పడ్డామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని షర్మిలకు వినతి పత్రం ఇచ్చారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 170వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో కుల్చారం మండలం పోతంశెట్ పల్లి గ్రామంలో పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి మెదక్ నియోజకవర్గంలోని మాచవరం, మంబోజిపల్లి మీదుగా సాగుతోంది. సాయంత్రం మెదక్ పట్టణంలో స్థానిక రాందాస్ చౌరస్తాలో జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.