అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు... అవినాష్ పై షర్మిల ఫైర్..

ఏపీలో ఎన్నికల హడావిడి ఒక రేంజ్ లో ఉంటే, కడప జిల్లా రాజకీయాలు ఇంకో రేంజ్ లో ఉన్నాయి. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటరైన షర్మిల వివేకా హత్య కేసు విషయంలో సీఎం జగన్, ఎంపీ అవినాష్ లపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఇటీవలే వివేకా హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించొద్దంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ అంశం గురించి ప్రస్తావించారు షర్మిల.

వివేకానంద రెడ్డికి రెండో భార్య అంశాన్ని తెరపైకి తెచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని అవినాష్ పై ఫైర్ అయ్యారు షర్మిల. రెండో వివాహం అన్నది వివేకానంద రెడ్డి పర్సనల్ లైఫ్ కి సంబందించిన అంశమని, ఆయన చనిపోయాక వ్యక్తిగత స్వార్థం కోసం ఈ అంశాన్ని తెరపైకి తేవటం దారుణమని అన్నారు. 2019 ఎన్నికల్లో అవినాష్ కోసం ప్రచారం చేస్తున్న సమయంలో వివేకాకు రెండో ఫ్యామిలీ ఉందన్న విషయం తెలీదా అని ప్రశ్నించారు. అప్పుడు లేని అభ్యంతరం, ఆయన చనిపోయి ఐదేళ్లు గడిచాక ఎందుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.