హైదరాబాద్: ఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల ఘటనను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగపరమైన విమర్శలు, ప్రతి విమర్శలకే తప్ప భౌతిక దాడులకు చోటులేదని అన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇది వ్యక్తిపై జరిగిన దాడి కాదని, మైనార్టీలందరిపై జరిగిన దాడిగా పరిగణించాలని షర్మిల అభిప్రాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యూపీ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురవకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని షర్మిల ఎన్నికల సంఘాన్ని కోరారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న AIMIM అధ్యక్షులు,MP @asadowaisi గారి మీద జరిగిన కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరమైన విమర్శలు, ప్రతి విమర్శలకు చోటు ఉందే తప్ప ఇలాంటి భౌతిక దాడులకు చోటులేదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యూపీ ప్రభుత్వం 1/2
— YS Sharmila (@realyssharmila) February 4, 2022