దళిత బంధు  కాదు..  అనుచరుల బంధు : షర్మిల 

రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి సీఎం కేసీఆర్ న్యాయం చేయలేదని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.  కేసీఆర్ది దిక్కుమాలిన పాలన అని అన్నారు.  రుణమాఫీ నుంచి డబుల్ బెదురూమ్ ఇండ్ల వరకు అన్నింటిలో ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని ఆమె ఆరోపించారు. మహిళా సంఘాలను వైఎస్ఆర్ బలోపేతం చేస్తే కేసీఆర్ దానిని నిర్వీర్యం చేశాడని షర్మిల ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని చెప్పారు. ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే పెన్షన్ ఇచ్చి వారి కుటుంబంలో కేసీఆర్ ప్రభుత్వం గొడవలు సృష్టిస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్ హాయాంలో అమల్లోకి తెచ్చిన సబ్సిడీలు ఎత్తేసి.. రూ. 5వేలు రైతుబంధు ఇవ్వడం ఘోరమన్నారు. బీఆర్ఎస్ ఇచ్చేది దళిత బంధు  కాదని అది అనుచరుల బంధు  అని షర్మిల విమర్శించారు.