హైదరాబాద్: ఉచిత ఎరువులు ఇస్తామన్న హామీ ఏమైందని సీఎం కేసీఆర్ ను వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పెట్టుబడి రాక రైతులు చస్తుంటే సంబరాలు చేసుకుంటున్నారా అని దుయ్యబట్టారు. ‘ఎరువుల ధరలు పెరిగాయని, రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు. కానీ కేంద్రం మెడలు వంచుతామంటే నమ్మాలా? మొన్నటివరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకొన్నారని చెప్పిన వాళ్ల మెడలు మీరు వంచుతారా? ఎందుకు మీ రాజకీయ డ్రామాలు’ అని షర్మిల క్వశ్చన్ చేశారు. అధికారం కోసం, కుర్చీ కోసం కేసీఆర్ ఆడుతున్న నాటకాల్లో ఇదీ ఒక భాగమే తప్ప.. రైతుల మీద ఆయనకు ప్రేమ లేదన్నారు. అన్నదాతల చావుల మీద సీఎంకు సోయి లేదని షర్మిల ట్వీట్ చేశారు.
ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయింది.
— YS Sharmila (@realyssharmila) January 13, 2022
పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు.
ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి అని
రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు. కానీ
కేంద్రం మెడలు వంచుతామంటే.. 1/2 pic.twitter.com/K55x6v6kQW
మరిన్ని వార్తల కోసం: