Andhra Polling : ఇడుపులపాయలో ఓటు వేసిన వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో మొదటి రెండు గంటల్లోనే.. అంటే ఉదయం 9 గంటల సమయానికి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 10 శాతంపైనే ఓటింగ్ నమోదైంది. ముఖ్యంగా వృద్దులు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతులకు తరలిరావటం విశేషం.

ఇక వైఎస్ఆర్ జిల్లాలో కడప పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఇడుపులపాయ పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భర్త అనీల్, కుమార్తెతో కలిసి వచ్చి ఓటు వేశారు షర్మిల.