వరంగల్ నగరంపై సీఎం కేసీఅర్కు ప్రేమ లేదని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి సీఎం ఎన్నో పిట్ట కథలు చెప్పి మాటల గారడి చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ను ఐటీ హబ్ చేస్తామని మాట ఇచ్చారని.. కానీ ఇక్కడికి ఒక్క ఐటీ కంపెనీ వచ్చింది లేదు.. ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. డల్లాస్ నగరంగా వరంగల్ను మారుస్తానని ఇచ్చిన హామీ ఏమైందని కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు.
కేసీఆర్ మాయ మాటల వల్ల చివరికి మహాకవి కాళోజికి సైతం గౌరవం దక్కలేదని షర్మిల అన్నారు. కాళోజి పేరుమీద కళాక్షేత్రం కడతానని కేసీఆర్ చెప్పాడని ఇప్పటికి ఆ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ఇది కాళోజీకి అవమానన్నారు. కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ కేసీఅర్ కు దేవాదుల మీద ఉంటే ఎప్పుడో పూర్తి అయ్యేదని షర్మిల అన్నారు. వైఎస్సార్ మరణం తరువాత కూడా ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. -వైఎస్సార్ సంక్షేమ పాలనను మళ్ళీ తిరిగి తీసుకు వస్తామని షర్మిల హామీ ఇచ్చారు.
-.