హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అప్పులు తీరినయ్ అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. రూ.1.49 లక్షల కోట్లతో "కాళేశ్వరం తిప్పిపోతల పథకం" కట్టిన కేసీఆర్, మూడేండ్లకే మునిగిన ప్రాజెక్ట్‌తో రూ.80వేల కోట్ల అప్పెట్ల తీర్చారని మంగళవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. రోజుకు 3 టీఎంసీ లు అని చెప్పి, అర టీఎంసీ కూడా ఎత్తలేని ప్రాజెక్టు బాకీలు తీర్చిందా అని ఆమె నిలదీశారు.\
ALSO READ :14 రాష్ట్రాల్లో 1200 చోరీలు.. 25 ఏండ్లుగా దొంగతనాలు
“ఎత్తిపోసిన 157 టీఎంసీలలో 100 టీఎంసీలను గోదావరిలో పోసినందుకు బాకీలు తీరినయా?, లక్ష ఎకరాల సాగుకు దిక్కులేని ప్రాజెక్టుతో వడ్లు ఉస్కె లెక్క పండినయా?, మీరు పుట్టకపోతే తెలంగాణలో వ్యవసాయమే లేనట్లు..ప్రాజెక్టు కట్టకపోతే రైతుకు దిక్కేలేనట్లు ఉంది మీ వ్యవహారం”అని ఆమె ఎద్దేవా చేశారు. దొరకు కాళేశ్వరం ఒక ఏటీఎం అయిందని షర్మిల మండిపడ్డారు.