దయలేని మంత్రి దయాకర్ రావు : వైఎస్ షర్మిల

దయలేని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.  ఆయనకు దయే ఉంటే.. పాలకుర్తి,చెన్నూరు రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.  కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టులను మంత్రి  ఆపాడని షర్మిల ఆరోపించారు. అభివృద్ధి కోసం కేసీఅర్ పార్టీలో చేరానని చెప్తున్న దయాకర్ రావు... అభివృద్ది ఎక్కడ చేశాడో చూపించాలన్నారు. కనీసం పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ కూడా లేదని విమర్శించారు. పంచాయతీలకు నిధులు లేవని సర్పంచులు ఆడిగితే  ఖాళీగా ఉన్న బీరు బాటిళ్లు అమ్ముకొని నడపండని మంత్రి దయాకర్ అనడం దారుణమన్నారు. 5వ తరగతి ఫెయిల్ అయిన దయాకర్ రావు  మంత్రి అవ్వొచ్చు కానీ డిగ్రీలు, పీజీలు చదివినోళ్లు మాత్రం  ఖాళీగా తిరగాలా అని షర్మిల ప్రశ్నించారు. తనది ఆంధ్ర కాదన్న షర్మిల... తెలంగాణ పేరును మీ పార్టీ నుంచి తీసేసి బందీపోట్ల రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారని ఎద్దెవా చేశారు. జై తెలంగాణ అనే దమ్ము కేవలం వైఎస్ఆర్టీపీకే ఉందన్నారు.  ప్రజల సమస్యల కోసం  కోట్లాడిన పార్టీ తమదని షర్మిల స్పష్టం చేశారు.