బంగారు తెలంగాణ కాదు బార్ల తెలంగాణ : షర్మిల

ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఏం చేశారంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర వరంగల్ లో కొనసాగుతోంది. కమలాపూర్ మండలం ఉప్పల్ నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా ప్రస్థాన పాదయాత్ర 3300 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదని షర్మిల అన్నారు. కేజీ టూ పీజీ, ఉచిత విద్య హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. పోడు రైతుల సమస్యలు కూడా పరిష్కరించకుండా అలాగే ఉన్నాయన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ షర్మిల మండిపడ్డారు.బంగారు తెలంగాణ అని చెప్పి.. బీర్ల తెలంగాణ,బార్ల తెలంగాణ చేసిండన్నారు