హైదరాబాద్, వెలుగు : పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టులో 31 మోటార్లకు ఒకే ఒక్కటి పూర్తి చేసి దక్షిణ తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటు న్నారని కేసీఆర్పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. వైఎస్సార్ రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కమీషన్ల కోసం కేసీఆర్ రూ.52 వేల కోట్లకు పెంచారని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ALSO READ : జమిలి ఎన్నికలపై 23న కోవింద్ కమిటీ భేటీ
కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు వైఎస్సార్ నీళ్లిచ్చారని, కేసీఆర్ మాత్రం పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూములను పడావు పెట్టారన్నారు. ఇన్నాళ్లూ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడని కేసీఆర్.. కేవలం ఎన్నికలు వచ్చాయని హడావుడి చేస్తున్నారన్నారు. అరకొర పనులు చేసి ప్రాజెక్టు మొత్తం పూర్తయిందన్నట్లు ప్రజల్ని మభ్యపెడుతున్నాని మండిపడ్డారు.