సీఎం కేసీఆర్ పర్యటనపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తే ముఖ్యమంత్రి బెంగళూరు టూర్ కు వెళ్లడాన్ని ఆమె తప్పుబట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం, కడిగిపారేస్తాం, ఏకిపారేస్తామన్న కేసీఆర్.. మోడీ హైదరాబాద్ వస్తే ఎక్కడికి పారిపోయారని షర్మిల నిలదీశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు, మద్దతు ధర విషయంలో ఎందుకు ఏకిపారేయలేదని షర్మిల ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లు మోడీ వస్తే పిరికివాని లెక్కన పారిపోయావా అని సటైర్ వేశారు.
కేసీఆర్ పాలన అవినీతిమయం అంటున్న ప్రధాని మోడీ దాన్ని ఎందుకు బయటపెట్టడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇరువురు నేతలు ఎదురుపడకుండా జనాలను మాత్రం పిచ్చోళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మాటలన్నీ ప్రసంగాలకే పరిమితమన్న షర్మిల.. మోడీ, కేసీఆర్ లు ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకోవద్దని చీకటి ఒప్పందాలు చేసుకున్నారా అని ప్రశ్నించారు. ఇరుపార్టీల నేతలు ఒప్పందంలో భాగంగానే ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.
ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం, కడిగిపారేస్తాం, ఏకిపారేస్తాం అన్న కేసీఆర్ సారు
— YS Sharmila (@realyssharmila) May 27, 2022
మోడీ ఇక్కడకు వస్తే మీరెక్కడికి పారిపోయారు?
మా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు,
మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేక పోయావా?
పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లు మోడీ గారొస్తే పిరికోడి లెక్క పారిపోయావా? 1/2