వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిన షర్మిల

వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలోని తనికెళ్ల గ్రామంలో పర్యటిస్తోన్న ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. షర్మిలకు వడదెబ్బ తగిలినట్లుగా పార్టీ నేతలు తెలిపారు. తనికెళ్ల గ్రామంలో ఇటీవల  కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను షర్మిల పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె  మీడియాతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లి పడిపోయారు.  వెంటనే అప్రమత్తమైన నేతలు ఆమెకు వాటర్ అందిచారు.  కాసేపటికి ఆమె కోలుకున్నారు. 

పంట నష్టంపై రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు షర్మిల.  కేసీఆర్  గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పిపోయాడంటూ ఎద్దేవా చేశారు.  ఇక ఏప్రిల్ 29 శనివారం రోజున వరంగల్ జిల్లాలో పర్యటించిన షర్మిల పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నష్టపరిహారాన్ని రైతులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.