మోదీతో ఒకరు పొత్తు.. మరొకరు తొత్తు.. ఏపీపీసీసీ చీఫ్​ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్సార్​  కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరులో జరిగిన  ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.   న్యాయయాత్ర పేరిట...  వైఎస్ షర్మిల ఏపీలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వం, టీడీపీ, బీజేపీలపై విమర్శలు చేస్తూ వెళుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా గ్యారంటీ అని చెబుతున్నారు. ఈరోజు  ( మే 6) ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కాలేజి క్రాస్ రోడ్, రిషి అపార్ట్మెంట్,వాసవి కళ్యాణ మండపం,భగత్ సింగ్ కాలనీ, సంజీవ్నగర్, శ్రీనివాస్నగర్, శివాలయంసెంటర్, జిన్నారోడ్, అమృతనగర్, ఖాదర్ బాద్ మీదుగా ప్రచారం కొనసాగించారు. 

ఆంధ్రప్రదేశ్​ లో ట్రయాంగిల్​ లవ్​ స్టోరీ నడుస్తుందని ఏపీ పీసీసీ చీఫ్​ షర్మిలా రెడ్డి అన్నారు. బాబుకి.. జగన్​ కి .. ఇద్దరికి మోదీ కావాలి.. ఇద్దరు మోదీని పట్టుకుని వేలాడుతున్నారు.  బీజేపీతో ఒకరు పొత్తుగా ఉంటే .. మరొకరు తొత్తుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రత్యేకహోదాతో పాటు.. కడప స్టీల్​ ప్లాంట్​ను తాకట్టు పెట్టారంటూ విమర్శించారు. కడప ఎంపీగా గొడ్డలి అవినాష్ రెడ్డి ఏనాడైనా ప్రజలకు సేవ చేశాడా అని ప్రశ్నించారు. 

ప్రొద్దుటూరు షర్మిల ఎన్నికల సభలో మాట్లాడుతూ.. గొడ్డలి అవినాష్​ కావాలా..  వైఎస్సార్​ బిడ్డ కావాలా అని ప్రశ్నించారు.  కొంగు చాపి న్యాయం అడుగుతున్నానన్నారు. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలని వైఎస్​ షర్మిల కోరారు.  వైఎస్సార్​ తమ్ముడు వివేకాను హత్య చేసిన వారికి ఇంకా శిక్ష పడలేదంటే,, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  ప్రజా కోర్టులో న్యాయం కోసం జరుగుతున్న పోరాటమే కడప ఎన్నికలని షర్మిల అన్నారు.   నేను ఆరోజు బాబాయి వివేక మాట విని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదంటూ... కడప ప్రజలు న్యాయం కోసం నిలపడాలన్నారు.వైఎస్సార్​ బిడ్డగా మాల ఇస్తున్నా.. వైఎస్సార్​ మాదిరిగా... ఈ గడ్డ బిడ్డలకు సేవ చేస్తానన్నారు.