వైసీపీ అధినేత జగన్ హత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెళ్లకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. వివేకా హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. వినుకొండ హత్య వ్యక్తిగత హత్యేనని.. రాజకీయమైంది కాదన్నారు.
వినుకొండలో జరిగిన హత్యకు కారణం వ్యక్తిగత కక్షలేనని పోలీసులు కూడా తేల్చేశారని షర్మిల గుర్తుచేశారు. హతుడు, హంతకుడు ఇద్దరూ నిన్నమొన్నటి వరకు వైసీపీతోనే ఉన్నారని గుర్తుచేస్తూ.. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుందని నిలదీశారు. ఓవైపు రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా మంది జనం వరదల్లో చిక్కుకున్నారని, ఇల్లూ వాకిలీ నీట మునగడంతో దిక్కుతోచక రోదిస్తున్నారని షర్మిల చెప్పారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని అనిపించడం లేదా? అంటూ జగన్ ను ప్రశ్నించారు. 'కేవలం మీ పార్టీ వాళ్లు ఓటు వేస్తేనే మీరు గెలిచారా? ఐదేళ్లు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారంట.. అంటూ జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
ALSO READ | ప్రశ్నిస్తానన్న భయం కాబట్టే.. ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ట్వీట్..
ఏపీలో కూటమి ప్రభుత్వంపై మాట్లాడిన షర్మిల బీజేపీ ఆంధ్ర్ ప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. అలాంటి బీజేపీతో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కురిసిన వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని.. ప్రతి రైతుకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని... ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలన్నారు. - ఇప్పటికే రాష్ట్రంలో రైతులు చితికి పోయారన్నారు. - జగన్ సర్కార్ లో రైతులు చితికి పోయారంటూ.. - YSR ఉన్నప్పుడు వ్యవసాయం రైతులకు పండుగగా ఉందని ..- రైతుకు వైఎస్ఆర్ పెద్ద పీట వేశారు. - YSR తలపెట్టిన జలయజ్ఞం జగన్ విస్మరించారు..- ప్రాజెక్టు కట్టకపోగా ఉన్నవాటికి మరమత్తులు లేవు.. - సబ్సిడీ పథకాలను మొత్తం జగన్ ఎత్తేశాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
- ఏపిలో కూడా కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే 2 లక్షల రుణమాఫీ చేసే వాళ్ళమని షర్మిల అన్నారు. - తెలంగాణలో 40 లక్షల మంది రైతులు రుణ విముక్తులు అయ్యారు - YSR అమలు చేసినట్లే రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేశాడు - ఇక్కడ ఎందుకు అమలు చేయరు అని చంద్రబాబు ను ప్రశ్నించారు. - ఏపి నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు.- అందరు బీజేపీకి మద్దతు ఇచ్చినా... ప్రయోజనం శూన్యమన్నారు.
ALSO READ | అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్
అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోయారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు, మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారు. వీటన్నిటిపై ఏనాడూ ధర్నా చేయలేదు కానీ మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదే 11 మంది, ఉన్న ఆ కొద్దిమందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొనరా? ప్రజావ్యతిరేక బిల్లులపై పాలకపక్షంతో కొట్లాడే అవసరం మీకు లేదనుకుంటున్నారాఅంటూ జగన్ ను షర్మిల నిలదీశారు.