సీఎం రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఆహ్వానం అందుకేనా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆయన నివాసంలో కలిశారు. జులై 8న విజయవాడ CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే..  మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖరరెడ్డి 75 వ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం అందించారు.  ఈ వేడుకల్లో ఆ రోజున దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి నివాళి అర్పించేందుకు కాంగ్రెస్​ పెద్దలు విజయవాడకు రానున్నారు. ఈ కార్యక్రమానికి  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు  మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ  కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు ..  ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులను షర్మిల ఆహ్వానించారు. 

ఇంకా.. YSR గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలను కూడా వైఎస్​ షర్మిల ఆహ్వానించారు.  పార్టీలకు.. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వైఎస్​ అభిమానులు హాజరై మహానేత ఙ్ఞాపకాలను స్మరించుకోవాలని .. వైఎస్సార్​ ఎంతో కష్టపడిన పార్టీకి అధ్యక్షురాలిగా ఉండటం .. ఆయన బిడ్డగా తనకు ఎంతో గొప్పవరమని వైఎస్​ షర్మిల అన్నారు.