వైఎస్ షర్మిల అరెస్టు

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను  అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం  స్టేషన్ కు తరలించారు. అరెస్టు అనంతరం ఆమె పోలీసు స్టేషన్ లో ధర్నాను కొనసాగిస్తున్నారు. 

ఉద్యోగాలు రాకపోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ లో చలనం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వని ఈ సీఎం మనకొద్దన్నారు. తక్షణం కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరుతూ ఇవాళ మధ్యాహ్నం ఆమె.. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం టీఎస్పీఎస్సీ ఆఫీసు ఎదుటనే ఆమె ధర్నాకు దిగారు. నిరుద్యోగులకు సంఘీభావంగా సాయంత్రం వరకు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తానని షర్మిల చెప్పారు. 

ఇవి కూడా చదవండి:  

దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి

కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పటికీ కలిసే ప్రసక్తి లేదు