పాలేరులో పార్టీ ఆఫీసు నిర్మాణానికి షర్మిల భూమిపూజ

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  కరుణగిరి చర్చి ఎదురుగా ఉన్న ఎకరా స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులకు ఆమె భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 తెలంగాణాలో రాబోయే ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్న వైఎస్ షర్మిల.. గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు.  అటు వచ్చే ఎన్నికల్లో షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుండి తాను పోటీ చేస్తానని ఇప్పటికే  ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పాలేరులో YSRTP పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.