హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలని ప్రభుత్వం ఇంటెలిజెన్స్ తో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడంపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల స్పందించారు. ఈ ఆరాటం ఏదో ముందే ఉంటే ఐపీఎస్ అకున్ సబర్వాల్ డైరెక్షన్ లో ఏడాదిపాటు సీరియల్ లా సాగిన డ్రగ్స్ కేసు నీరుగారిపోయేదా, అందరికీ క్లీన్ చిట్ వచ్చేదా అని ప్రశ్నించారు. రైతుల చావులను పక్కదారి పట్టించేందుకు డ్రగ్స్ కేసును ముందుకు తెస్తున్నారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారుది సమస్యలను పక్కదారి పట్టించే పాలనే తప్పితే.. పరిష్కారం చూపే పాలన కాదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే రైతు ఆత్మహత్యల మీద చర్చించాలని డిమాండ్ చేశారు.
చురకల్లాంటి పోలీసులతో టీం,వేయి మంది ఇంటలిజెన్స్ తో స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి
— YS Sharmila (@realyssharmila) January 29, 2022
డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలని నిర్ణయం తీసుకొన్న దొరగారు,ఈ ఇగురమేదో ముందే ఉంటే
IPS అకున్ సబర్వాల్ డైరెక్షన్ లో
ఏడాదిపాటు సీరియల్ లాగా సాగిన డ్రగ్స్ కేస్ నీరుగారిపోయేదా?
అందరికి క్లీన్ చీట్ వచ్చేదా? 1/2
మరిన్ని వార్తల కోసం: