తెలంగాణ నేతలతో షర్మిల భేటీ.. లోటస్ పాండ్‌లో హడావుడి..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఈరోజు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నల్గొండ జిల్లా నేతలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలక నేతలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు ఒక ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. పార్టీ పెట్టాలా? వద్దా? అనే అంశంతో పాటు… పలు కీలక అంశాలపై నేతల సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలువురు నేతలు లోటస్ పాండ్‌కు చేరుకున్నారు. కాగా.. షర్మిల ఇంటిముందు వైస్ అభిమానులు.. ఏపీ సీఎం వైస్ జగన్ ఫోటో లేకుండానే భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ మీద జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్, జై షర్మిలక్క అని ముద్రించారు.

For More News..

అప్పులు తీర్చలేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ ఉపసర్పంచ్

చర్చలకు మేం రెడీ: రైతులు

ఉత్తరాఖండ్ జల ప్రళయానికి కారణమదేనా?

హైదరాబాద్‌లో ఎత్తైన అపార్ట్‌మెంట్.. పర్మిషన్ ఇచ్చిన అధికారులు