సోనియా, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రియాంకతో షర్మిల భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పూర్వ వైభవం తేవడానికి, బలమైన శక్తిగా పార్టీ తీర్చిదిద్దేందుకు అడుగులు పడనున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని 10 జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ తదుపరి కార్యాచరణపై మంతనాలు జరిపారు. పార్టీ బలోపేతం దిశగా భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణ, తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించామని షర్మిల ఒక ప్రకటనలో వెల్లడించారు.