సూర్యాపేట మార్కెట్ యార్డులో షర్మిల ధర్నా

కేసీఆర్ హయాంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సూర్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులు రైతులతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళారుల చేతుల్లో మోసపోతున్న విధానాన్ని షర్మిల దృష్టికి తీసుకొచ్చిన అన్నదాతలు.. ఇవాళ మార్కెట్లో ఇద్దరు రైతులకు మాత్రమే రూ.1960 ధర చెల్లించారని చెప్పారు. మెజార్టీ రైతులకు కనీసం రూ.1500 లోపు కూడా ధర అందడం లేదని వాపోయారు.

రైతులంటే కేసీఆర్కు లెక్కే లేదని షర్మిల విమర్శించారు. దొంగ సంతకం పెట్టి రైతుల్ని బాయిలో తోసిండని ఆరోపించారు. కేసీఆర్ కారణంగా 17లక్షల ఎకరాల్లో వరి వేయలేదని, 35లక్షల ఎకరాల్లో పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని షర్మిల వాపోయారు. వరి వేస్తే ఉరి అన్న సన్నాసి సీఎం కేసీఆర్ ముమ్మాటికీ రైతు ద్రోహి అని అన్నారు. రుణమాఫీ చేయకుండా కేవలం రైతు బంధు ఇస్తే సరిపోతుందా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ బిడ్డగా తనను ఆశీర్వదిస్తే రైతును రాజును చేస్తానని హామీ ఇచ్చారు.

For more news..

అట్టహాసంగా ఏఆర్‌ రెహమాన్‌ పెద్ద కూతురు పెళ్లి

కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యండిల్ ను బ్లాక్ చేసిన కేటీఆర్