హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. తెలంగాణను తెగనమ్మితేగాని ఆదాయం రాని పరిస్థితి నెలకొందన్నారు. భూములు, జాగలు అమ్మాలి, లిక్కర్ తాగించాలి లేదంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఏడేండ్లలో ఏడు రెట్లు అప్పులు చేసి రూ.5 లక్షల కోట్లకు చేర్చారని దుయ్యబట్టారు. ఏడాదికి రూ.30 వేల కోట్లు అప్పుల మిత్తీలకే సరిపోతే.. ఇక రాష్ట్రాన్ని ఎలా నడుతపుతారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ చేసిన అని చెప్పుకొంటున్న దొరగారు.. రూ.5 లక్షల కోట్ల అప్పు ఎవరికోసం చేశారని క్వశ్చన్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపారా, పంట నష్టపోయిన రైతును ఆదుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకున్నారా, కార్పొరేషన్స్ లోన్స్ ఇచ్చారా అని నిలదీశారు. కమీషన్లతో ఫామ్ హౌస్ లు నింపుకోవడానికి రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శించారు.
తెలంగాణను తెగనమ్మితేగాని ఆదాయం రాని పరిస్థితి. భూములు జాగలు అమ్మాలి. జనానికి లిక్కర్ తాగించాలి. లేదంటే అప్పులు తేవాలి. ఏడేండ్లలో 7 రెట్లు అప్పులు చేసి 5 లక్షల కోట్లకు చేర్చారు. ఏడాదికి 30 వేల కోట్లు మీరు చేసిన అప్పుల మిత్తీలకే సరిపోతే, ఇగ రాష్ట్రాన్ని నడిపే ఇగురం ఏది?
— YS Sharmila (@realyssharmila) March 8, 2022
బంగారు 1/2
మరిన్ని వార్తల కోసం: