ఆత్మహత్యల రాష్ట్రంగా మారుతుంటే తమాషా చూస్తున్నారు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మరోమారు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగుల చావులు ఆగాలంటే కేసీఆర్ సర్కారును కూల్చి వేయాల్సిందేనన్నారు. ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు నిప్పింటించుకుని సూసైడ్ చేసుకుంటుంటే కేసీఆర్ లో ఎలాంటి చలనం లేదన్నారు. నిరుద్యోగుల చావులతో తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని.. కానీ దొర మాత్రం జాబ్స్ ఇవ్వకుండా, రైతులను ఆదుకోకుండా అధికారం ఉందనే అహంకారంతో తమాషా చూస్తున్నాడని దుయ్యబట్టారు. 

‘కేసీఆర్ ఓ నిరుద్యోగుల హంతకుడు. ఆయన రైతుల హంతకుడు. ఉద్యోగుల చావులకు కారకుడు కేసీఆర్ గారు. ఉద్యోగాలు ఇవ్వని, అన్నదాతల చావులను ఆపని, ఉద్యోగుల చావులకు కారణమయ్యే అహంకార పాలన మనకొద్దు. కేసీఆర్ అధికారాన్ని కూల్చేస్తేనే రాష్ట్రంలో చావులు ఆగిపోతాయి’ అని షర్మిల ట్వీట్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఒమిక్రాన్తో టెన్షన్ వద్దు.. వైరస్ బలహీనపడుతోంది

ప్రధానిపై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏఆర్ రెహ్మాన్కు కాబోయే అల్లుడు ఎవరంటే..?