దొందూ దొందే.. ఇద్దరూ దొంగలే

హైదరాబాద్: మోడీ, కేసీఆర్లు ఒకే తాను ముక్కలని వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. మోడీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని.. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీజీ.. ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. కానీ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కూడా ఉన్న ఉద్యోగులను పీకేస్తూ, నిరుద్యోగులు చచ్చేలా చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ తెలంగాణకు అన్యాయం చేసి మహారాష్ట్రకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని విమర్శించారు. తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ సాధించడంలో కేసీఆర్ కొట్లాడలేదన్నారు. 

కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు విషయంలోనూ రాష్ట్రానికి మోడీ మొండిచెయ్యి చూపారని షర్మిల అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందివ్వలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో.. నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్లు లేఖాస్త్రాల డ్రామాలకు తెరలేపారని ట్వీట్ చేశారు. రాష్ట్రానికి కేసీఆర్, మోడీలు చేసిందేమీ లేదని.. దొందు దొందేనని, ఇద్దరూ దొంగలేనని విమర్శించారు. 

మరిన్ని వార్తల కోసం: 

హీరోయిన్స్ అంటే గ్లామర్ డాల్స్ కాదు

దిశ ఎన్ కౌంటర్ కేసు.. సుప్రీంకు కమిషన్ నివేదిక