అప్పులు తీరే మార్గం లేక రైతు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా షర్మిల ఈ రోజు నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కాల్వ తండాలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు బానోత్ అంబర్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓవైపు అప్పులు, మరోవైపు వరి కొనమని సర్కారు చెప్పడంతోనే అంబర్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని షర్మిల మండిపడ్డారు. ‘ప్రతిరోజు ముగ్గురు, నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరందరి ఆత్మహత్యలకు కేసీఆరే కారణం. సీఎంకు కనికరం లేదు. పాలన చేతకాకపోతే దిగిపోండి. చేతకాకపోతే రుణమాఫీ ఎందుకు ప్రకటించారు? రైతు ఆత్మహత్యాలన్నీ కేసీఆర్ చేసిన హత్యలే. తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ చావు డప్పు ధర్నాలు. వరి రైతుల విషయంలో కేసీఆర్ చేతగానితనం బయటపడుతోంది. మీరూ.. మీ కుటుంబం బాగుంటే సరిపోతుందా కేసీఆర్? ఇప్పటి వరకు సంపాదించిన వేల కోట్లతో ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకో. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న దానికంటే దోచుకుంటున్నదే ఎక్కువ. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారమివ్వాలి. రైతులు ఏ పంట పండించాలో, ఏది పండించొద్దో చెప్పె హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారు? రైతులు వారికిష్టమైన పంట పండిస్తారు.. ప్రభుత్వం కొనాల్సిందే’ అని షర్మిల అన్నారు.
https://twitter.com/realyssharmila/status/1473536668699271177
For More News..
పిల్లల మొహం చూసి వదిలేయమన్నా కనికరించని మావోలు