మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. సీఎం కేసీఆర్ అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉందని ఆరోపించారు YSRTP అధ్యక్షురాలు YS షర్మిల. సోమవారం ట్విట్టర్ వేదికగా షర్మిల కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్స్ వదిలారు. మేఘా కంపెనీ నిర్మించిన పంప్ హౌజులు మునిగినా .. కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో చనిపోయిన కార్మికుల ప్రాణాలు లెక్కలేవా అని ప్రశ్నించారు. గుట్టలు కొల్లకొట్టి మట్టిని పక్క రాష్ట్రాలకు తరలించడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. ఆ సంస్థ కాంట్రాక్టులను రద్దు చేయాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు.
మేఘా సంస్థపై సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమై, జనం సొమ్ము దోచుకుంటున్న సంస్థకు బుద్ధి చెప్పాలన్నారు. రక్షణ చర్యలు పాటించకుండా, నాసిరకం పనులు చేస్తూ, అడిగేవాడు ఉండకూడదని అడ్డగోలుగా లంచాలు ఎర వేస్తూ ప్రజల ప్రాణాలతో మేఘ కంపెనీ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. తక్షణం కంపెనీ కాంట్రాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.
మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు, కేసీఆర్
— YS Sharmila (@realyssharmila) August 1, 2022
అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది. అందుకే మేఘా కంపెనీ పంపు హౌస్ లు మునిగినా, ప్రాణాలు తీసినా, గుట్టలు కొల్లగొట్టి మట్టిని ఇసుకను పక్క రాష్ట్రానికి తరలించినా, రూల్స్ కు విరుద్ధంగా చేసిన బ్లాస్టింగ్ ల వల్లే పంపుహౌస్ లు 1/2