ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేనటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం అవసరానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారని ఆమె ఆరోపించారు. నీళ్లెత్తి పారబోయడానికి వేలకోట్ల కరెంటు బిల్లులు కడుతున్నారని షర్మిల అన్నారు. పర్యాటకులను ఆకర్షించేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన సీఎం కేసీఆర్కు జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కమీషన్లకోసం అవసరాని కన్నా 4 ఇంతల ఖర్చు ఎక్కువ పెట్టి
— YS Sharmila (@realyssharmila) January 25, 2022
గోదారి నీళ్లెత్తి గోదారిలో పారబోయటానికి వేలకోట్ల కరెంటు బిల్లులు కడుతూ, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకున్నా, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించిన KCR గారికి జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు