సీఎం కేసీఆర్పై షర్మిల మండిపాటు
హైదరాబాద్ : ‘‘రాష్ట్ర ప్రజల పైసలను పంజాబ్ రైతులకు పంచడానికి మీ తాత జాగీరా?” అని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో ఫైర్ అయ్యారు. ‘‘మన రైతులను ఆదుకోవటానికి చేతులు రావు. పంటలు కొనటానికి మనసొప్పదు. సర్పంచ్ లకు బిల్లులు ఇయ్యడానికి నిధులుండవు. విద్యార్థులు ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వడానికి” అని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలానికి చెందిన రైతు దబ్బేట మల్లేశం మృతి.. సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అప్పులు తెచ్చి పంచాయతీ పనులు చేసిన సర్పంచ్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి,విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసల్ రావు కానీ తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా? పంట దిగుబడి లేక పెట్టుబడి
— YS Sharmila (@realyssharmila) May 22, 2022
రాక మీరు ఆదుకొంటారనే ఆశ 1/2 pic.twitter.com/DhhTKBpSyw
మరిన్ని వార్తల కోసం : -
రాష్ట్ర సంపదంతా ఆంధ్రా కాంట్రాక్టర్లకు ధారాదత్తం
ట్రైబల్ వర్సిటీ అడ్మిషన్లు ఈసారీ లేనట్లే!