కేసీఆర్ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు

కేసీఆర్ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు

కేసీఆర్ రాజ్యంలో ఆరేండ్ల పాపకు భద్రత లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జూబ్లీహిల్స్ లో  మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఆమె స్పందించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో చిన్నపాప నుండి అరవై ఏళ్ల బామ్మ దాక రక్షణ కరువయ్యిందన్నారు. ఉన్నోడికి చట్టం చుట్టమైతే..లేనోడికి న్యాయం బజార్లో దొరుకుతుందా? అని ప్రశ్నించారు. ఈ ఘటనలో  టీఆర్ఎస్ నాయకుల బంధువులు ఉన్నారని ఆరోపించారు. మిత్రపక్షం MLAల కొడుకులు నిందితులుగా ఉన్నందుకే ఇంత జాప్యం జరుగుతుందా అని నిలదీశారు. ఇది బంగారు తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవమని షర్మిల అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నారని..డ్రగ్స్ కు హైదరాబాద్ ను అడ్డాగా మార్చారని మండిపడ్డారు. స్వయంగా సీఎం నిందితులను తప్పించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు.

మరిన్ని వార్తల కోసం

పబ్లో అశ్లీల నృత్యాలు.. పలువురు అరెస్ట్

ఇవాళ స్వర సారథి ఎస్పీ బాలు జయంతి