
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 17న సాయంత్రం 5.30 గంటలకు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని ప్యాలెస్ లో రాజారెడ్డి, ప్రియ అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం తలంబ్రాల వేడుక జరగనుంది.
వైఎస్ షర్మిల కుటుంబం రెండు రోజుల క్రితమే జోధ్ పూర్ ప్యాలెస్ కు వెళ్లింది. ఫిబ్రవరి 16న సంగీత్, మెహందీ నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను లేటెస్ట్ గా షర్మిల తన ట్విట్టర్లో షేర్ చేశారు. నవదంపతులకు విషెస్ చెప్పారు.
పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కు ప్లాన్ చేశారని తెలుస్తోంది. శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ జరగనుంది. పలువురు సినీ,రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారని సమాచారం. జనవరి 18న రాజారెడ్డి, ప్రియ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో జరిగింది. సీఎం జగన్ దంపతులు ఈ వేడుకకు హాజరయ్యారు.
Congratulations RajaPriya #RajaPriya #Haldi #wedding #happyforbothofyou ♥️ pic.twitter.com/qffN2ofJSq
— YS Sharmila (@realyssharmila) February 17, 2024