మేం గెలవలె అసెంబ్లీకి పోతలేం.. మీరెందుకు పోతలేరు: జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

మేం గెలవలె అసెంబ్లీకి పోతలేం.. మీరెందుకు పోతలేరు: జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. అధికార టీడీపీ.. తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదన్న కారణంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరించారు. మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీలో కాలు పెడతామంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుల తీరుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 

మేం గెలవలె అసెంబ్లీకి పోతలేం..

అసెంబ్లీకి వెళ్లడానికి భయపడుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులెవరూ గెలవక అసెంబ్లీకి వెళ్లట్లేదు.. మరి వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేరని షర్మిల ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్ళనపుడు గెలిచిన మీకు.. ఓడిన మాకు తేడా ఏంటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ధ్వజమెత్తారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఎంతో సేవ చేశారు

జగన్ పుట్టక ముందు నుంచే ఉంది కాంగ్రెస్ పార్టీ ఉందని గుర్తుచేసిన షర్మిల.. వైసీపీ అధినేతకు తమ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని తెలిపారు. 

Also Read:-దానవీరశూరకర్ణలో NTR నటనకు మించి చంద్రబాబు యాక్టింగ్

"వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ప్రాణత్యాగం చేశారు. అటువంటి పార్టీని చిన్న చేసి మాట్లాడుతారా ? మీరు మాట్లాడాలి అనుకుంటే మీ గురించి చెప్పండి. రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన మోసాల గురించి మాట్లాడండి. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. జనాలను చంపి డోర్ డెలివరీ చేశారు. పోలీసు వ్యవస్థను కుక్కల్లా వాడుకున్నారు. కాదంబరి లాంటి మహిళలను వేధించారు. మీ అరాచకాలు, మాఫీయాలు తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని ఓడించారు.." అంటూ షర్మిల వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.