హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నందున సీఎం రేవంత్ రెడ్డికి, సహచర మంత్రులకు , ఎమ్మెల్యేలకు ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, సహచర మంత్రులకు, ఎమెల్యేలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకూ హృదయ పూర్వక అభినందనలు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి @revanth_anumula , సహచర మంత్రులకు, ఎమెల్యేలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయ పూర్వక అభినందనలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ…
— YS Sharmila (@realyssharmila) December 7, 2024
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయం. కాంగ్రెస్ తోనే రాష్ట్రాల అభివృద్ధి. హస్తమే దేశానికి అభయహస్తం. ’ అని షర్మిల పేర్కొన్నారు