గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆడపిల్లల బాత్రూముల్లో హిడెన్ కెమెరాల ఘటన ఏపీలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది.ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని, చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందని అన్నారు.
ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే... వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని అన్నారు షర్మిల. కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యమని, యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణమని అన్నారు. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని అన్నారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలని అన్నారు. తక్షణమే ఉన్నతస్థాయి కమిటి వేయాలని, సీనియర్ ఐపిఎస్ అధికారులతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఆడపిల్లల బాత్ రూముల్లో హెడెన్ కెమెరాలు..
3వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలి. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు..…Also Read : గర్ల్స్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాపై ఉద్రిక్తత
— YS Sharmila (@realyssharmila) August 30, 2024
బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని, రాజకీయ నాయకుడి కొడుకా, కూతురా కాదని, కెమెరాలు పెట్టింది ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాలని అన్నారు.బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తానని, విద్యార్థినిలతో మాట్లాడుతానని, వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని ట్వీట్ చేశారు షర్మిల.