హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. 59 ఏండ్లు దాటినోళ్లు రైతులు కాదా అని ఆమె ప్రశ్నించారు. వాళ్లకు రైతుబీమా ఎందుకివ్వరని క్వశ్చన్ చేశారు. రైతుకు వయోపరిమితి పెట్టడమేంటని మండిపడ్డారు. దీనిపై కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. కోర్టు మొట్టికాయలు వేస్తేనే కేసీఆర్ స్పందిస్తాడన్నారు. కౌలు రైతులకు ధీమా కరువైందన్నారు. బంగారు తెలంగాణ కాదు.. బతుకే లేని తెలంగాణగా మారుతోందని చెప్పారు. కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ పిచ్చి.. బీజేపీకి మత రాజకీయాల పిచ్చి ఉందని పేర్కొన్నారు.
https://t.co/yb0nd8RyJp
— YS Sharmila (@realyssharmila) February 23, 2022
59ఏండ్లు దాటినోళ్లు రైతులు కాదా?
-వాళ్లకు రైతుబీమా ఎందుకియ్యరు
-రైతుకు వయోపరిమితి పెట్టడమేంటి
-దీనిపై కోర్టులో తేల్చుకుంటాం:కోర్టు మొట్టికాయలు వేస్తేనే కేసీఆర్ స్పందిస్తడు
- కౌలు రైతులకు ధీమా కరువు
-KCRకు తెలంగాణ సెంటిమెంట్ పిచ్చి
-BJPకి మత రాజకీయాల పిచ్చి
కౌలు రైతు కూడా ముమ్మాటికీ రైతేనని.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని షర్మిల అన్నారు. బంగారు తెలంగాణలా.. బంగారు భారత్ చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. తెలంగాణలో గుడులు ఎక్కువ ఉన్నాయా, వైన్ షాపులు ఎక్కువ ఉన్నాయా అని ప్రశ్నించారు. మద్యం అమ్మకపోతే రాష్ట్రం నడవని పరిస్థితిలో ఉందన్నారు. కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశారని.. రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై రూ.4 లక్షల అప్పు ఉందన్నారు. ప్రతి రైతుకు కనీసం రూ.2 లక్షల అప్పు ఉందన్న షర్మిల.. అప్పులు కట్టలేకే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు.
మరిన్ని వార్తల కోసం: