వైఎస్సార్ ఘూట్ వద్ద నివాళులు అర్పించిన షర్మిల

వైఎస్సార్ వర్దంతి సందర్భంగా వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో వైఎస్సార్  ఘూట్ వద్ద నివాళులు అర్పించారు.  తన తల్లి విజయమ్మతో  కలిసి ఇడుపులపాయకు వచ్చిన షర్మిల.. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి..  ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.  

ఇడుపులపాయలో షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.  కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రకటనపై పార్టీ శ్రేణులకు ఆమె సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అటు కాంగ్రెస్ సినీయర్ లీడర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిశారు షర్మిల.