విద్యార్థుల బలిదానాలపై అధికారంలోకి వచ్చి వారిపైనే దాడులా?

ఎంతో మంది ఉద్యమకారులు, కళాకారులను అందించిన గడ్డ ఓరగల్లు అని చెప్పారు వైఎస్ షర్మిల. లోటస్ పాండ్ లో వరంగల్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం  నిర్వహించారు. పదేళ్ళ కింద ఇదే రోజు జరిగిన మిలియన్ మార్చ్ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటిందన్నారు. కంతెనపల్లి ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం బాధాకరమన్నారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి వరంగల్ ను ఐటీ సిటీగా చేయాలనుకున్నారని చెప్పారు. విద్యార్థుల బలిదానాల మీద అధికారంలోకి వచ్చిన పాలకులు.. ప్రశ్నించినందుకు విద్యార్థులపై దాడులు చేయడం బాధాకరమన్నారు షర్మిల. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వరంగల్ జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులు అర్పించారు వైఎస్ షర్మిల.