సీఎంగా ఇదేనా నీ కర్తవ్యం.. జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ..

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల కడప బరిలో పోటీకి దిగి అవినాష్ రెడ్డి, జగన్ లపై నాన్ స్టాప్ గా విమర్శలు చేస్తుండగా, షర్మిలకు తోడు వివేకా కూతురు కూడా జగన్, అవినాష్ లకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కూడా అడపా దడపా జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బహిరంగ లేఖ ద్వారా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు సౌభాగ్యమ్మ.

కుటుంబ సభ్యులే వివేకాను హత్య చేస్తారని తామెవ్వరు ఉహించలేకపోయామని అన్నారు సౌభాగ్యమ్మ. హత్య కేసులో నిందితులుగా ఉన్నవారికి జగన్ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ఒక రాష్ట్ర సీఎంగా నీ కర్తవ్యం ఇదేనా అని ప్రశ్నించారు సౌభాగ్యమ్మ. ఇప్పటికైనా సునీత, షర్మిలల పోరాటం అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరారు సౌభాగ్యమ్మ. ఈ క్రమంలో సౌభాగ్యమ్మ లేఖ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.