బషీర్ బాగ్, వెలుగు: హంతకులు చట్టసభల్లో ఉండకూడదని.. ఏపీ ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి కోరారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి వ్యతిరేకంగా రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు న్యాయం చేయాలని 'జస్టిస్ ఫర్ వివేకా' పార్ట్ 1 పేరుతో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆమె పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. కడప తరహా హత్యా రాజకీయాలు తనకు అలవాటు లేదని.. అదే అలవాటు తనకు ఉంటే అప్పుడే వాళ్లను నరికేసే దానినని సంచలన వ్యాఖ్యలు చేశారు.