తెలంగాణతో మా అనుబంధం 40 ఏళ్లది.. ఇప్పుడు షర్మిలమ్మ కారణంగా ఆ బంధం మరింత బలపడనుందని తెలిపారు వైఎస్ విజయమ్మ. ఖమ్మంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఆవిర్భావ సభలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్ల కిందట ఏప్రిల్ 9న YSR చేవెళ్ల నుంచే పాదయాత్ర చేసి విజయవంతం అయ్యారని తెలిపారు. ఇప్పుడదే రోజున తన తండ్రి అడుగుజాడల్లో ఖమ్మం జిల్లా గుమ్మం నుంచే తన రాజకీయ తొలి అడుగులు వేసేందుకు షర్మిల మీ ముందుకు వచ్చిందని.. రాజన్న బిడ్డ కొత్త పార్టీ పెట్టబోతోందని తెలియగానే, మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
రాజశేఖర్ రెడ్డిని నాయకుడిగా నిలబెట్టిన ప్రాంతం తెలంగాణ...అందుకే మా కుటుంబం మీకెప్పుడూ రుణపడి ఉంటుందన్నారు వైఎస్ విజయమ్మ.