వరంగల్ విద్యార్థిని ఆత్మహత్యపై వైఎస్ఆర్ సీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు.
ఉద్యోగాలు లేక ప్రవల్లిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరనానికి పాల్పడుతుంటే.. కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు అంటూ మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే.. ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు..? అని ప్రశ్నించారు. ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. సర్కార్ హత్య అని ఆరోపించారు.
Also Read : వెజ్ బదులు నాన్ వెజ్.. జొమాటో, మెక్‌డొనాల్డ్‌లపై రూ. 1 లక్ష జరిమానా
నష్ట జాతకురాలు ప్రవల్లిక కాదని, అన్ని అధికారాలున్నా నిరుద్యోగుల కోసం ఏం చేయలేని పాలకులు నష్ట జాతకులు అని ట్విట్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ అశోక్‌నగర్ లో వరంగల్ కు చెందిన విద్యార్థిని మర్రి ప్రవల్లిక (25) శుక్రవారం (అక్టోబర్ 13న) ఆత్మహత్య చేసుకుంది.
ఉద్యోగాలు లేక ప్రవల్లిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరనానికి పాల్పడుతుంటే.. కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారు? ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు? ప్రవల్లికది ఆత్మహత్య…
— YS Sharmila (@realyssharmila) October 14, 2023