ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కో అకౌంట్‌లో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు జమ.. ఎవరికంటే...

ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కో అకౌంట్‌లో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు జమ.. ఎవరికంటే...

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం (నవంబర్​ 23) తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి డీబీటి ద్వారా విడుదల చేశారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

పేద వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం అందించడం సంతోషకరమని, ఇప్పటివరకూ మూడు పర్యాయాలు కళ్యాణమస్తు, షాదీ తోఫా అందించామని ఏపీ సీఎం జగన్​ అన్నారు.  టీడీపీ హయాంలో  మొక్కుబడిగా పథకాలు అమలు జరిగాయి.వయసు పరిమితి పెట్టడం వల్ల బాల్య వివాహాలు తగ్గుతాయన్నారు.పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాలకు అర్హతలు నిర్ణయించారు. వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.348.84 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

 పేదలు విద్యావంతులు కావాలనే ఈ పథకానికి 10వ తరగతి అర్హతగా నిర్ణయించామన్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించడానికి అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. పేదలందరికీ విద్య అందించడంలో భాగంగా విద్యాసంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలంతా ఉన్నత విద్య వైపునకు వెళ్లడానికే మోటివేషన్‌ చేయడం ఈ పథకం లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం, బీసీ కుటుంబాలకు రూ. 50వేల రూపాయలు ఆర్థిక సాయం’’ అందిస్తున్నామని సీఎం తెలిపారు.