ఎన్నికల వేళ.. పిట్టల దొర వింతలు అన్నీఇన్నీ కావు : వైఎస్ షర్మిల

ఎన్నికల వేళ.. పిట్టల దొర వింతలు అన్నీఇన్నీ కావు : వైఎస్ షర్మిల

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వింతలు అన్నీ ఇన్నీ కావన్నారు. పాలమూరు జిల్లా ఓట్లు దక్కించుకునేందుకు చాలా అగచాట్లు పడుతున్నారంటూ మండిపడ్డారు. 

సగం కూడా నిర్మాణ పనులు కాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తారట అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. పాలమూరు–రంగారెడ్డిని కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపించారు. భూ నిర్వాసితులకు అణాపైసా సాయం అందలేదని, కాలువలకు భూసేకరణ కూడా పూర్తి కాలేదన్నారు. 

ALSO READ : డీఎంకే అంటే డెంగ్యూ, మలేరియా, కోసు(దోమ) .. ముందు వీటిని నిర్మూలించాలి: అన్నామలై

ఇది పూర్తిగా ఎన్నికల స్టంటేనని, పాలమూరు మీద ప్రేమ మాత్రం కాదన్నారు. దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవన్న సర్వేలతో కేసీఆర్ కు భయం తప్ప.. నీళ్లు ఇవ్వాలన్న సోయి లేదన్నారు వైఎస్ షర్మిల. 

సెప్టెంబర్ 16వ తేదీన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద మోటర్లను ఆన్ చేసి, మహా బహుబలి పంప్ ద్వారా కృష్ణా జలాలను అంజనగిరి రిజర్వాయర్ లోకి ఎత్తిపోయనున్నారు.