
విజయవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం నెలకు రూ.25,220- నుంచి రూ.80,910 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.drysruhs.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.