వైఎస్సార్సీపీ ఆరో జాబితా విడుదల

వైఎస్సార్సీపీ ఆరో జాబితా విడుదల

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది.  ఇప్పటికే ఐదు విడతలుగా ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల ఇంఛార్జీలను ప్రకటించిన వైఎస్సార్సీపీ తాజాగా  శుక్రవారం(ఫిబ్రవరి 2) ఆరో జాబితా విడుదల చేసింది. నాలుగు పార్లమెంట్ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను మంత్రి మేరుగ నాగార్జున, సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఇప్పటికే ఐదు జాబితాలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు సీఎం వైస్ ఎస్ జగన్.  

ఎంపీ స్థానాలు- ఇంఛార్జీలు 

  • నర్సాపురం(ఎంపీ)- అడ్వకేట్ ఉమాబాల 
  • చిత్తూరు (ఎంపీ) - ఎన్ రెడ్డప్ప
  • గుంటూరు (ఎంపీ)- ఉమ్మారెడ్డి వెంకటరమణ
  • రాజమండ్రి(ఎంపీ) - గూడూరు శ్రీనివాస్

ఎమ్మెల్యే స్థానాలు- ఇంఛార్జీలు 

  • నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్ 
  • మైలవరం - తిరుపతి రామ్ యాదవ్
  • మార్కాపురం - అన్నా రాంబాబు 
  • ఎమ్మిగనూరు - బుట్టా రేణుక 
  • గిద్దలూరు- కే. నాగార్జునరెడ్డి 
  • మైలవరం- సర్నాల తిరుపతిరావు యాదవ్
  • జీడీ నెల్లూరు - కె. నారాయణ స్వామి